నా అక్షరాలు రెక్కలు విప్పిన పక్షులు

Wednesday, July 11, 2012

కొత్త వైద్యం

  
                                  అత్తారింటి కొత్త వైద్యం 
                                  కోడలి కన్నీళ్ళకి మందు కట్నం డబ్బులంటా

అలల పోరాటం



ఎక్కడికో ఎదగాలనే ఆరాటం 
ఎందరికో స్ఫూర్తి నీ ప్రయత్నం 
తీరం పైకి నీ దండయాత్ర అలుపెరుగని 
యోధుడిలా
తీరం అందలేదని ఆవేశపడకు 
నింగి దొరకలేదని తొందరపడకు 
నీటి అణువులన్నీపోగేసి సైన్యం గాచేసి
నువ్వు చేసే నిరంతర యుద్ధం
మానవాళికి నిరంతర పాఠం
సమస్యను ఎదురుకునేందుకు
ఆకాశమే నీ హద్దు దాన్ని ఎప్పుడు చెరపొద్దు
సాగిపో విహంగమై నింగిదాక
చేరుకుంటావు నీ తీరం అనే ప్రేయసిని
నీ నిరంతర అలల ముట్టడిలో

Wednesday, June 27, 2012

కఠిన శిల


                                          మెత్తటి పూల ఉసురెందుకు 
                                           కఠిన శిలను కొలిచేందుకు 

Tuesday, June 12, 2012

నా కలల తీరం


                                                తీరంపైకి  అలల ముట్టడి 
                                           ఎప్పటికి నిన్ను గెలవలేని నా లా

Tuesday, June 5, 2012

చీకటి , వెలుగుల దోబూచులాట



చీకటిని చింపేశాడు
 అల్లరి సూరీడు 
తన కిరణాలతో
 చక్కలిగిన్తలేట్టేస్తున్నాడు 

నిరాశలో ఉన్న చీకటికి 
వుత్తేజాన్నిచ్చాడు 
ఓడిపోయి ఒంటరిగా ఉన్న చీకటికి 
నేనున్నానని అభయాన్నిచ్చాడు

వెన్నెలలోని మసకలే
 జీవితం కాదని 
వెలుగు లోకం వుందని
తేల్చి చెప్పాడు 
తప్పులన్నీ తనలో 
జరుగుతున్నాయి అని 
తల్లడిల్లే నిశికి తన 
వెలుగుతో విముక్తి ఇచ్చాడు 

సమస్త జనావళిని తన 
అజ్ఞాన  నిద్రలో ముంచెత్తే చీకటి ని 
తన వెలుగు కిరణాల తో 
అజ్ఞానాన్ని తోలేసాడు సూరీడు 
నల్లరంగు తనకుందని 
కుమిలి పోతున్న చీకటికి 
తన వెలుగు రంగును 
తొడిగాడు సూరీడు.....
ఇదే చీకటి , వెలుగుల దోబూచులాట 

Monday, June 4, 2012

మనసు వ్యాపారం


                                              మనిషి మారిపోయాడు 
                                     వ్యాపారం ఇప్పుడు మనసుతో చేస్తున్నాడు